ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరియ విశ్వ విద్యాలయం వారి యువా విభాగం (రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్ RERF), తరపున ఈ రోజు 22 జనవరి ఆదివారం 10 ఏకరాల స్థలంలో నిర్మించిన విశాలమైన ప్రాంగణంలో”యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ (UPRC)”, అమరావతి, బ్రహ్మాకుమారీస్, యువావిభాగం వైపు నుండి ఒక ప్రాజెక్టు ని శ్రేష్ఠమైన మనస్సు ద్వారా విజయవంతమైన జీవితం తీసుకుని యువకుల కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. *ఈ రోజు కార్యక్రమంలో విశేషంగా యువకుల కోసం శ్రేష్ఠమైన మనస్సుతో జీవితంలో విజయం ఎలా సాధించాలి పరీక్షలలో భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి,అనే అంశాల పైన BK. రామ కృష్ణ అన్నయ్య గారు, శాంతి సరోవరం, హైదరాబాద్ నుండి వచ్చి పిల్లలకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయింది.ఇందులో ముఖ్య అతిథిగా హాజరైన వారిలో Bk. శాంత బెహన్ గారు, విజయవాడ ప్రాంతీయ నిర్వాహకురాలు,Bk. రామ కృష్ణ అన్నయ్య,Bk. భారతి అక్కయ్య,Bk.జయ అక్కయ్య ,Bk. పద్మజ అక్కయ్య,BK. రాధ అక్కయ్య,Bk. లక్ష్మి అక్కయ్య (సిడ్నీ నుండి వచ్చిన), శ్రీనివాస్ గారు,సిటీ కేబుల్ విజయవాడ,NRI IT college,ఆగిరిపల్లి నుండి 200 మంది విద్యార్థినులు బాలికలు పాల్గొన్నారు కంకిపాడు,రాయపూడి నుండి స్కూల్ పిల్లలు విశేషంగా పాల్గోన్నారు.